Saturday, 29 May 2021

మనం అనుకున్నది అనుకున్నట్టు..

మనం అనుకున్నది అనుకున్నట్టు..జరగక పోవడాన్నే జీవితం అంటారు.  మనం అనుకున్నట్టు జరిగితే దానిని జీవితం ఎందుకు అంటారు ? 


డబ్బుతో అన్ని కొనలేము.. అన్నది ఎంత నిజమో ... డబ్బుతో చాలా కొనగలం అనేది కూడా అంతే నిజం!

Saturday, 22 June 2019

7 ప్రశ్నలకు చాలా అద్భుతమైన జవాబులు..

7 ప్రశ్నలకు చాలా అద్భుతంగా  జవాబు చెప్పిన "సాధుసంతు."

1వ ప్రశ్న:  ప్రపంచంలో ఏది పదునైనది?
జ: చాలా  మంది కత్తి అని చెప్పారు.
సాధు:  కాదు,మనిషి నాలుక, ఎందుకంటే ఈ నాలుక తో మనుషులు ఇతరుల మనస్సును,వాళ్ళ నమ్మకాలను విరగ్గొట్టేస్తారు.

2వ ప్రశ్న: మనకు అత్యంత దూరంలో వున్నది ఏమిటి ?
జ: చాలా మంది చంద్రుడు ,సూర్యుడు ,గ్రహాలూ
సాధు: మనకు అత్యంత దూరంలో వున్నది గడిచిపోయిన కాలం,ఎంత ప్రయత్నించినా ఆ కాలాన్ని  తీసుకురాలేము,ఆ కాలంలోకి వెళ్లలేము.అందుకే వున్న ఈ సమయాన్నే మంచి పనులకు సద్వినియోగం చేసుకోవాలి. ఎంత డబ్బు వున్నా కూడా మనం గడిచిన కాలంలోకి వెళ్లలేము.

3వ ప్రశ్న:  ప్రపంచంలో పెద్దది ఏది?
జ: చాలా మంది పర్వతం ,సూర్యుడు ,భూమి
సాధు: ప్రపంచంలో పెద్దది మన పాపమే.

4వ ప్రశ్న: ప్రపంచంలో కఠినంగా,బరువుగా ఉండేది ఏది ?
జ: చాలా మంది స్టీల్, ఐరన్,ఏనుగు అని చెప్పారు.
సాధు: కఠినమైనది అనేది "మాట ఇవ్వడం"
మాట ఇవ్వడం తేలికే కానీ నిలబెట్టుకోవడమే చాలా కష్టం.

5వ ప్రశ్న: ప్రపంచంలో తేలికైనది ఏది?
జ: దూది,గాలి,ఆకులు అని చెప్పారు
సాధు: ప్రపంచంలో తేలికైనది అనేది ఒకరిని చూసి వ్యంగ్యంగా మాట్లాడడం.

6వ ప్రశ్న: మనకు దగ్గరగా వున్నది ఏది?
జ: తల్లి తండ్రులు, స్నేహితులు,బంధువులు అని చెప్పారు.
సాధు: మనకు దగ్గరగా ఉండేది మన చావు.
అందరూ దూరమైనా కూడా ఎప్పుడో ఒకప్పుడు చావు అనేది కఛ్ఛితం.

7వ ప్రశ్న: ప్రపంచంలో సులువైనది ఏది ?
జ: తినడం ,పడుకోవడం, తాగడం,తిరగడం 
సాధు:  ప్రపంచంలో సులువైనది అనేది మరొకరి  మనస్సును విరగ్గొట్టడం, ఇంతకంటే సులువు  ఏదీ లేదు.

Friday, 21 June 2019

పెరుగును సతాయిస్తే వెన్న వస్తుందా ?

👉 పాలను భాధ పెడితే పెరుగు వస్తుంది.
👉 పెరుగును సతాయిస్తే వెన్న వస్తుంది.
👉 వెన్నని సతాయిస్తే నెయ్యి వస్తుంది.
👉 పాల కంటే పెరుగు విలువ ఎక్కువ, పెరుగు కంటే వెన్న విలువ ఎక్కువ, వెన్న కంటే నెయ్యి విలువ      ఎక్కువ. కానీ, ఈ నాలిగింటి రంగు తెలుపె.
👉 దీని అర్థం ఏమిటంటే... మాటిమాటికి దుఃఖం, పరిస్థితులు వచ్చినా కూడా ఏ వ్యక్తి రంగు మారదో, సమాజంలో ఆ వ్యక్తికే విలువ ఉంటుంది.
👉 పాలు ఉపయోగ పడేవే, కానీ ఒక రోజు కోసమే..తరువాత అవి కారబు అయ్యిపోతాయి....
👉 పాలల్లో ఒక చుక్క మజ్జిగ వేయడంతో అది పెరుగు అవుతుంది...కానీ రెండు రోజులే ఉంటుంది...
👉 పెరుగును చిలకడంతో వెన్న వస్తుంది. ఇది కూడా 3 రోజులు ఉంటుంది...
👉 వెన్నని కాచి నప్పుడు నెయ్యి వస్తుంది. నెయ్యి ఎప్పుడూ ఖరాబు అవ్వదు...
👉 ఒక్కరోజులో పాడైఏ పాలలో ఎప్పుడూ పాడవ్వని నెయ్యి దాగి ఉంది...
👉 అదేవిధంగా మీ మనసు కూడా లెక్కలేన్నని శక్తులతో నిండి ఉంది, దానిలో కొన్ని మంచి ఆలోచనలిని నింపి..మీకు మీరే చింతన చెయ్యండి...మీ జీవితాన్ని సరిచేసుకుని అప్పుడు చూడండి....
👉 మీరు ఎప్పుడూ ఓడిపోరు...ధైర్యశాలి అవుతారు

ఎదుటి వాడిని విమర్శించడం చాలా తేలిక ..

గుణపాఠం నేర్పించే ఈ కథ చదవండి.

ఒక వ్యక్తి పెయింటింగ్ కోర్సు పూర్తి చేశాడు ..
3 రోజులు కష్టపడి ఒక అద్భుతమైన పెయింటింగ్ గీశాడు . దాని మీద ప్రజల అభిప్రాయం
తెలుసుకోవాలి అనుకున్నాడు .
.
నాలుగు రోడ్లు కల్సే చోట దానిని ప్రదర్శించాడు . దాని కింద ఇలా ఒక నోటీసు పెట్టాడు
.
" నేను గీసిన మొదటి పెయింటింగ్ ఇది . ఇందులో మీకు లోపాలు కనిపించవచ్చు . ఎక్కడ లోపం ఉందొ అక్కడ ఒక " ఇంటూ " మార్కు పెట్టండి అని అందులో ఉంది .
.
దానిని అక్కడ ఉంచి తిరిగి సాయంత్రం వచ్చి చూశాడు . అతడికి ఏడుపు వచ్చింది . దాని నిండా
" ఇంటూలే ". ఖాళీ లేదు .
.
ఏడుస్తూ తనకు నేర్పిన మాస్టారు దగ్గరకి పట్టుకు వెళ్ళాడు . " నేను పెయింటింగ్ వెయ్యడానికి పనికి రాను అని నాకు తెలిసి పోయింది " అంటూ విచారించాడు .
.
మాస్టారు అతడిని ఓదార్చారు . అదే పెయింటింగ్ మళ్ళీ వెయ్యమన్నారు . మళ్ళీ అదే పెయింటింగ్ అలాగే వేసుకుని వచ్చాడు . ఈసారి కూడా అక్కడే పెట్ట మన్నారు గురువుగారు . దానికింద ఈ సారి నోటీసు ఇలా రాయించారు గురువుగారు .
.
" నేను గీసిన మొదటి పెయింటింగ్ ఇది . ఇందులో మీకు లోపాలు కనిపించవచ్చు . ఎక్కడ లోపం ఉందొ అక్కడ క్రింద నేను పెట్టిన రంగులతో , బ్రష్ లతో దానిని సరి చెయ్యండి " అని ఆ నోటీసు లో ఉంది .
.
వారం రోజులు అయినా ఒక్కరూ దానిలో లోపాలను సరి చెయ్యలేదు .
.
ఎందుకలా జరిగింది ?
.
ఎదుటి వాడిని విమర్శించడం చాలా తేలిక . సరి చెయ్యడం చాలా కష్టం.

👉 ఒకరి జీవితాన్ని విమర్శించి పడకొట్టడము వారికి చాలా సులభం కాని వారి జీవితాన్ని సరిచేయడము వారికి చేతకాదు.

*THIS IS EXACTLY WHAT IS HAPPENING NOW IN THIS SOCIETY!!!

Saturday, 14 October 2017

ఎవరెవరో వచ్చి ఏమేమో...

మంగి : నాకు రాత్రి అతి ఘోరమైన  కల వచ్చింది.
రంగి : ఏం కల వచ్చిందే..
మంగి : ఎవరెవరో వచ్చి ఏమేమో చేసినట్టు కల వచ్చిందే ..  
రంగి : ఎం భయపడే అవసరం లేదే...
కలలన్ని నిజమైతే  నేనెన్ని సార్లు గర్భవతిని అయ్యేదాన్నో