7 ప్రశ్నలకు చాలా అద్భుతమైన జవాబులు..

 
 
 
 
 
 
 
7 ప్రశ్నలకు చాలా అద్భుతంగా  జవాబు చెప్పిన "సాధుసంతు."

1వ ప్రశ్న:  ప్రపంచంలో ఏది పదునైనది?
జ: చాలా  మంది కత్తి అని చెప్పారు.
సాధు:  కాదు,మనిషి నాలుక, ఎందుకంటే ఈ నాలుక తో మనుషులు ఇతరుల మనస్సును,వాళ్ళ నమ్మకాలను విరగ్గొట్టేస్తారు.

2వ ప్రశ్న: మనకు అత్యంత దూరంలో వున్నది ఏమిటి ?
జ: చాలా మంది చంద్రుడు ,సూర్యుడు ,గ్రహాలూ
సాధు: మనకు
అత్యంత దూరంలో వున్నది గడిచిపోయిన కాలం,ఎంత ప్రయత్నించినా ఆ కాలాన్ని  తీసుకురాలేము,ఆ కాలంలోకి వెళ్లలేము.అందుకే వున్న ఈ సమయాన్నే మంచి పనులకు సద్వినియోగం చేసుకోవాలి. ఎంత డబ్బు వున్నా కూడా మనం గడిచిన కాలంలోకి వెళ్లలేము.

3వ ప్రశ్న:  ప్రపంచంలో పెద్దది ఏది?
జ: చాలా మంది పర్వతం ,సూర్యుడు ,భూమి
సాధు: ప్రపంచంలో పెద్దది మన పాపమే.

4వ ప్రశ్న: ప్రపంచంలో కఠినంగా,బరువుగా ఉండేది ఏది ?
జ: చాలా మంది స్టీల్, ఐరన్,ఏనుగు అని చెప్పారు.
సాధు: కఠినమైనది అనేది "మాట ఇవ్వడం"
మాట ఇవ్వడం తేలికే కానీ నిలబెట్టుకోవడమే చాలా కష్టం.

5వ ప్రశ్న: ప్రపంచంలో తేలికైనది ఏది?
జ: దూది,గాలి,ఆకులు అని చెప్పారు
సాధు: ప్రపంచంలో తేలికైనది అనేది ఒకరిని చూసి వ్యంగ్యంగా మాట్లాడడం.

6వ ప్రశ్న: మనకు దగ్గరగా వున్నది ఏది?
జ: తల్లి తండ్రులు, స్నేహితులు,బంధువులు అని చెప్పారు.
సాధు: మనకు దగ్గరగా ఉండేది మన చావు.
అందరూ దూరమైనా కూడా ఎప్పుడో ఒకప్పుడు చావు అనేది కఛ్ఛితం.

7వ ప్రశ్న: ప్రపంచంలో సులువైనది ఏది ?
జ: తినడం ,పడుకోవడం, తాగడం,తిరగడం 
సాధు:  ప్రపంచంలో సులువైనది అనేది మరొకరి  మనస్సును విరగ్గొట్టడం, ఇంతకంటే సులువు  ఏదీ లేదు.

Comments