పురుషుల మెదళ్ల కన్నా.. ఆడవారి మెదళ్లు చాలా చిన్నవా ?

పురుషుల మెదళ్ల కన్నా..  ఆడవారి మెదళ్లు చాలా చిన్నవా ?  అవునూ చిన్నవే.. 
ఐతే ఏంటని అనుకుంటున్నారా ? అక్కడికే వద్దాం...

ఆడవారి మెదళ్లు, పురుషుల మెదళ్ల కన్నా ఎనిమిది నుండి పది శాతం చిన్నవే. అయినా మహా చురుకు .
మార్పులు, తమ చుట్టూ ఏమి  జరుగుతుందో వీరు యిట్టె పసిగట్టేస్తారు. వీరు ఎక్కువగా , చురుకుగా
పని చేయటానికి కారణం ఏంటంటే ...వీరి మెదళ్ల తీరు మగవారి కన్నా భిన్నంగా ఉండటమే.

కీలక సమయాల్లో వీరి మెదళ్లు మగవారి మెదళ్ల  కన్నా చురుకుగా పనిచేస్తాయి. హేతుబద్దంగా ఆలోచించటానికి
ఉపయోగపడే  న్యూరాన్ కణాలు పురుషుల్లో వేలల్లో ఉంటాయి...కానీ కనెక్షన్లు ఉండవు.  అదే ఆడవారిలో
కనెక్షన్లు ఉంటాయి. అందువల్లే వారు చురుకుగా ఆలోచిస్తారు, పనిచేస్తారు. మగవారు నాలుగైదు మాటల్లో వివరించే విషయాన్ని ఆడవారు ఒక్క మాటలో చెప్పగలరు . ఇది పరిశోధనల్లో వెల్లడైన నిజం.

Comments